WhatsApp ఛానల్‌లు అనేది మీరు శ్రద్ధ వహించే వ్యక్తులు, సంస్థల నుండి ఉపయోగకరమైన అప్‌డేట్‌లను పొందడానికి సాధారణ, వ్యక్తిగత మార్గం.
ఛానల్‌ల డైరెక్టరీని అన్వేషించండి, మీకు ఆసక్తి ఉన్న అంశాలకు సంబంధించిన ఛానల్‌లను ఫాలో అవ్వండి, అది మీ ఫేవరేట్ స్పోర్ట్స్ టీమ్‌కు సంబంధించిన తాజా విషయం కావచ్చు లేదా మీ స్థానిక బేకరీ నుండి రోజువారీ ప్రత్యేక ఐటమ్‌లు కావచ్చు. మీ ఫేవరేట్ ఛానల్‌లకు సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు బాగా ఇష్టమైన మరిన్ని అంశాలకు ప్రత్యేకమైన యాక్సెస్ పొందండి*.
* ఈ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు.
మీరు ఫాలో అయ్యే ఛానల్‌లను మీరు మాత్రమే చూడగలరు. మీ ఫోన్ నంబర్ ప్రైవేట్‌గా ఉంటుంది, మీరు కాంటాక్ట్‌గా సేవ్ చేసుకుని ఉన్న అడ్మిన్‌లు మాత్రమే దాన్ని చూడగలరు.
ఛానల్‌లు అనేవి మీ వ్యక్తిగత చాట్‌లు, కాల్‌లకు దూరంగా అప్‌డేట్‌ల ట్యాబ్‌లో ఉంటాయి, అలాగే ఛానల్ నోటిఫికేషన్‌లు డిఫాల్ట్‌గా మ్యూట్ చేయబడతాయి.
బిలియన్ల సంఖ్యలో ఉన్న గ్లోబల్ ఆడియన్స్‌తో అప్‌డేట్‌లను షేర్ చేసుకోండి, అలాగే WhatsAppలో మీ ఫాలోయింగ్‌ను ఎంగేజ్ చేయడానికి, పెంచుకోవడానికి విశ్వసనీయ మార్గానికి యాక్సెస్ పొందండి.
మీ ఆడియన్స్ డౌన్‌లోడ్ చేసుకోగల అనుకూల స్టిక్కర్‌లను డ్రాప్ చేయండి, వార్తలు షేర్ చేయడానికి వాయిస్ మెసేజ్‌లు పంపండి లేదా తమ ఆలోచనలను షేర్ చేయడానికి ఫాలోవర్‌లను ఆహ్వానించడానికి పోల్‌లను ఉపయోగించండి.
మీ ఛానల్ లింక్ లేదా ప్రత్యేక QR కోడ్‌ను మీ స్టేటస్‌లో, అలాగే మీ వ్యక్తిగత చాటింగ్‌లలో షేర్ చేయండి, తద్వారా మీ ఛానల్‌ను ఎక్కువ మంది వ్యక్తులు కనుగొనగలరు.
WhatsAppలో డబ్బు సంపాదిస్తూనే, అత్యంత ఎక్కువగా ఎంగేజ్ అయ్యే, సపోర్ట్ అందించే మీ ఫాలోవర్‌లతో ప్రత్యేకమైన, లైవ్ అప్‌డేట్‌లను షేర్ చేయండి.
* ఈ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు.